Home  »  TV News  »  శైలేంద్ర కన్నింగ్ ప్లాన్ ని వాళ్ళిద్దరూ పసిగట్టగలరా!

Updated : Aug 13, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' . ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-840 లో.. రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకసారి మహేంద్ర సర్ తో మాట్లాడండి సర్.. ఆయన సంతోషిస్తారని వసుధార అనగానే.. నేనెప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మేడమ్ అని వసుధారతో రిషి అంటాడు. మీకు తెలియదని చెప్పట్లేదు సర్.‌. గుర్తుచేస్తున్నానంతే అని వసుధార అంటుంది. ఒక్కో సిచువేషన్ లో ఎలా ఉండాలో మీ దగ్గరి నుండే నేను నేర్చుకున్నాని వసుధార అనగా.. ఇంక ఆపుతారా మేడమ్ అని రిషి అంటాడు. లేదు సర్ నేను ఆపను.. ఎందుకంటే ఆ రోజు నావల్లే మీరు బాధని భరించారు. కాబట్టే మీరు నన్ను పరాయిమనిషిలా చూస్తున్నా సహిస్తున్నానని వసుధార అంటుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అలా చేశాను సర్. కానీ అది తప్పు కాదు సర్.‌ నా వల్ల మీరు బాధపడుతున్నారని మీకోసం నేను బాధపడుతున్నానని వసుధార అంటుంది. మీరు మీ అమ్మనాన్నలతో సంతోషంగా ఉన్నారని వసుధారతో రిషి అంటాడు‌. లేదు.. మీ చుట్టూ ఉన్నవాటిని నమ్మకండి. ఒకసారి మా వైపు నుండి కూడా ఆలోచించండని రిషితో  వసుధార చెప్పి వెళ్ళిపోతుంది. తప్పని పరిస్థితులలో చేసినా తప్పు తప్పే.. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని రిషి తన మనసులో అనుకుంటాడు. 

మరొకవైపు కాలేజ్ కి వచ్చిన శైలేంద్ర.. కాలేజీ గురించి అన్ని వివరాలని ఒక సర్ దగ్గర తీసుకుంటాడు. దాంతో జగతి మహేంద్రలను ఆడుకోవాలని అనుకుంటాడు శైలేంద్ర. మరొకవైపు జగతి, మహేంద్ర కాలేజ్ కి వెళ్తూ మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని, మనం జాగ్రత్తగా ఉండాలని జగతి అనగా..  అన్నయ్య మొహం చూసి వాడిని వదిలేస్తున్నాని మహేంద్ర అంటాడు. 

మరొకవైపు శైలేంద్ర మాస్టర్ ప్లాన్ వేస్తాడు. జగతి, మహేంద్రల గురించి నెగెటివ్ న్యూస్ రాపించమని ఒక అతనికి అప్పగించగా.. అతను అలానే రాస్తాడు. దాంతో అతనికి కొంత డబ్బులు ఇస్తాడు శైలేంద్ర. ఇంట్లో ఉన్న జగతి, మహేంద్ర మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. రిషి మళ్ళీ బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మహేంద్రతో జగతి అంటుంది. మనం ఆ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు రిషి మొదట వద్దన్నాడు. కానీ లోలోపల ఎంత బాధపడ్డాడో నాకు తెలుసని ఆ తర్వాత అన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాడని మహేంద్ర అంటాడు. మళ్ళీ రిషి ఎప్పుడు కలుస్తాడో.. నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడో.. కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోలేని బహుశా నేను ఒక్కదాన్నే ఉన్నానేమోనని జగతి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పగా.‌. అతను చైర్మెన్‌ విశ్వనాథ్ గారికి ఆరోగ్యం బాగోలేదని చెప్తాడు. దాంతో జగతి, మహేంద్ర కంగారు పడతారు. ఇప్పుడెలా ఉందని ప్రిన్సిపల్ ని అడుగగా‌‌ బాగానే ఉన్నాడని చెప్తాడు‌. ఒకసారి విశ్వనాథ్ గారితో కాల్ మాట్లాడి అడిగి తెలుసుకుందామని జగతి, మహేంద్ర అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.